అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల్లో పెండింగులో ఉన్న దరఖాస్తులు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని కలెక్టర్ కోరారు.