ములుగు జిల్లా వాజేడు మండలంలోని జంగాలపల్లిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దోమల నివారణకు ఆదివారం రాత్రి 7 గంటలకు ఫాగింగ్ చేపట్టారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ చర్యకు పూనుకున్నారు. గత రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, తదితర వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ చేపిస్తున్నట్లు వారు తెలిపారు.