ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతలను మంత్రి కొండ సురేఖ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి కొండ సురేఖ సమ్మక్క సారలమ్మలకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతల ప్రత్యేకత దేశమంతా తెలుసని గతంలో మన ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె అన్నారు.