సుప్రీంకోర్టు భారత ఎన్నికల ప్రక్రియలో మళ్లీ పేపర్ బ్యాలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చినట్లు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ బ్యాలెట్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలని చేసిన అభ్యర్థనను తిరస్కరించిందన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుపై (ఈవిఎం) పిటిషనర్ డాక్టర్ కౌల్ చేసిన వాదనల్లో ఎలాంటి వాస్తవాలు లేవని న్యాయస్థానం పేర్కొందన్నారు.