ములుగు జిల్లా కేంద్రంలోని కిరాణా షాపుల్లో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలు అనుమానిత కిరాణా షాపుల్లో గంజాయి, నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, నిషేధిత గంజాయి ఎవరి దగ్గర ఉన్న, అమ్మిన, వాటిని ఉపయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా కు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.