ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిందని గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. రోహిర్, శంకర్రాజుపల్లిలో పార్టీ నేతలతో కలిసి రఘు పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, కావాలనే చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మకూడదన్నారు.