మతిస్థిమితం లేని వ్యక్తి దాడిలో ఒకరు గాయపడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన బిక్షపతి దామెరవాయి నుండి కాటాపూర్ గ్రామానికి బైకుపై వస్తుండగా ఇటుకబట్టి వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి బండ రాయితో కొట్టాడు. అనంతరం బిక్షపతి కింద పడిపోవడంతో. కర్రతో మళ్లీ తలపై తీవ్రంగా కొట్టాడు. గాయపడిన బిక్షపతిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.