రామన్నగూడెం ‌‌‌గోదావరి కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం

54చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ సమీపంలో గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. గత నెలలో కోతకు గురైన చోట ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయి. ఎగువ నుండి భారీగా వరద వస్తుండడంతో కరకట్ట మరింత కోతకు గురైంది. అధికారులు ఇసుక బస్తాలను నింపి కోతకు గురైన చోట అడ్డుగా వేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే కరకట్ట తెగే ప్రమాదం ఉందని రామన్న గూడెం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్