ములుగు ఏజెన్సీలో పంజా విసురుతున్న చలి

75చూసినవారు
ములుగు జిల్లా ఏజెన్సీలో చలి పంజా విసురుతుంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో ఇళ్లనుండి బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. సోమవారం ఉదయం 8-45 గంటలు దాటిన పొగ మంచు తగ్గడం లేదు. చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు చలికాలం తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.