అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: ఎస్పీ

59చూసినవారు
అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: ఎస్పీ
అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. పోలీస్, ప్రెస్ అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏటూరునాగారం, మంగపేటకు చెందిన రాంబాబు, సతీశ్, కార్తీక్, కమలాకర్,
జనార్దన్, తాడూరు మధుకర్ అనే వ్యక్తులు పోలీసు, రిపోర్టర్లమని రాత్రివేళ వాహనాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. సద్దాం అనే వ్యక్తి ఫిర్యాదుతో వారిని అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్