ములుగు కలెక్టరేట్ లో నేటి ప్రజావాణి రద్దు

68చూసినవారు
ములుగు కలెక్టరేట్ లో నేటి ప్రజావాణి రద్దు
ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అధికారులు నిమగ్నమై ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. కలెక్టరేట్ కార్యాలయానికి వినతులతో ఎవరూ రావద్దని జిల్లా కలెక్టర్ దివాకర సూచించారు.