ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్

1266చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వంవిఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు. సోమవారం నర్సంపేట విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్ ని కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్య వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పిన కేసీఆర్ కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నాడు. అందులో భాగంగానే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. బడిబాట కార్యక్రమం పేరుతో కోట్ల రూపాయలు మాయం ఏం చేస్తున్నాడు కానీ ప్రభుత్వ విద్య సంస్థలలో కనీస మౌలిక వసతులు (నీళ్లు బెంచీలు కరెంటు మరుగుదొడ్లు ఆట స్థలాలు). కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని అదేవిధంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకు వచ్చి పగడ్బందీగా అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పాఠశాలల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే ఆయా పాఠశాలల పై దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ కమిటీ సభ్యులు జిల్లా గర్ల్స్ కన్వీనర్ గడిపాక బిందు, కమిటీ సభ్యులు రాజే,ష్ అజయ్, శివ, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్