సీసీఐ కావాలనే రైతుల నుండి పత్తి కొనుగోలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాల వద్ద ఫోటోలకు ఫోజులిస్తున్నారు తప్ప ధరల మీద సమీక్ష చేయడం లేదు పత్తి రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర 7521 తో పాటు 475 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు.