ప్రపంచ బాలల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని స్వయంకృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎఫ్. ఎం. ఎం. సోషల్ సర్వీస్ సొసైటీ వారి సహకారం తో మంగళవారం ఓ ప్రైవేటు పాఠశాల లో బాలబాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల పైన జరిగే అన్ని రకాల వేధింపులను సమాజం లోని ప్రతీ ఒక్కరు వ్యతిరేకించి బాల బాలికల రక్షణ, సంరక్షణ ల కొరకు పాటుపడాలని పిలుపు నిచ్చారు.