వరంగల్ జిల్లా నెక్కొండ మండల తాజా మాజీ సర్పంచ్ ల ఆద్వర్యంలో 2019/2024 సర్పంచులు గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెక్కొండ మండలంలో శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి శాంతియుతంగా వినతి పత్రం అందజేశారు. మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించిన తర్వాతనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు.