మురుగు నీరుతో జాతీయ రహదారిపై ఇబ్బందులు

58చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, మునిసిపాలిటీ పరిధిలోని వల్లబ్ నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మంగళవారం మురుగు నీరు జాతీయ రహదారిపై నిత్యం పారుతోంది. డ్రైనేజి కాలువ లేకపోవడంతో పాటుగా నల్లా పైపు లీకేజీ కారణంగా రోడ్డు అంతా బురద మయంగా ఉంటుంది. ఈ సమస్యపై పలు మార్లు మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. కానీ పరిష్కారం చూపట్లేదు. ఇప్పటికైన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్