వానాకాలంలో మనిషి జీర్ణశక్తి మందగించి, ఆకలి వేయదు. అప్పుడు శరీరంలో వ్యర్థాలు పెరిగి అనారోగ్యానికి గురైతారు. దీన్ని నివారించడానికి బియ్యపు పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు తింటే సులభంగా అరగడంతోపాటు శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. కాబట్టి మన పెద్దలు ఇలా ఆవిరిపైన ఉడికించిన వాటిని తినడం మంచిదని నమ్మారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి కుడుములు, ఉండ్రాళ్లు సమర్పించే సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతారు.