జనగామ జిల్లా దేవరుప్పులలో ఓ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమారుడికి వాహనానికి ఆదివారం టోల్ గేట్ సిబ్బంది టోల్ ఛార్జీలు వేశారు. తన కొడుకుకే టోల్ ఛార్జీలు వేస్తావా అంటూ అతడి అనుచరులతో కలిసి సిబ్బంది వికాస్ పై చెప్పుతో దాడి చేసి గాయపరిచారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్ కుమార్ తెలిపారు.