డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని ఈనెల 21న మంగళవారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కొరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నిర్ణీత సమయంలో 9959226049కు ఫోన్ చేసి తమ విలువైన సూచనలను, సలహాలను అందించి, సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు డిపో అభివృద్ధికి సహకరించాలని డిఎం భూక్యా ధరంసింగ్ కోరారు.