తొర్రూర్ లో ప్రతి ఒక్కరు చెట్లను నాటాలని శ్రీ నలంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ పిలుపునిచ్చారు. హరిత
భారత్ కార్యక్రమంలో విద్యార్థులచే పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ చెట్లను పెంచడం వలన వాతావరణంలో సమతుల్యం నెలకొని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకయ్య,స్వాతి
విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.