పచ్చని చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని తొర్రూర్ పట్టణానికి చెందిన శ్రీ నలంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రవీందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి చెట్లను నాటడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భాలలో మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడం వలన వాతావరణ సమతుల్యత నెలకొని కాలుష్యం నివారించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ యాకన్న, ప్రైమరీ కోఆర్డినేటర్ అశ్విని, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ ఇన్చార్జులు శ్వేతా రెడ్డి, పుష్ప, కార్యక్రమ బాధ్యులు శ్వేత, రాజేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.