తొర్రూరు: అయ్యప్ప భక్తుల ఆందోళన

80చూసినవారు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లోని ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వామి మాల ధరించి డ్రైవర్ గా పనిచేస్తున్న ఉద్యోగి నాగరాజు కు గురువారం అవమానం జరిగింది. డ్యూటీ కి అయ్యప్ప మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు కు ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. తను అయ్యప్ప మాల ధరించానని ఎంత చెప్పినా వినలేదని వాపోయారు.
విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ డిపో మేనేజర్ క్షమాపణ చెప్పడంతో ఆందోళన విరమించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్