డబల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి అక్రమ ప్రవేశం

78చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎల్లరాయణి తొర్రూరు గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి బుధవారం కొందరు సామానులతో సహ వచ్చారు. అక్రమంగా చొరబడ్డ కొంతమంది ఆక్రమణదారులను పాలకుర్తి రెవిన్యూ సిబ్బంది మరియు పోలీసులు ఖాళీ చేయిస్తున్న సమయంలో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతామని బెదిరించగా సిబ్బంది వారిని వారించారు. వారిని ఖాళీ చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్