సంగెం: మీరందరు ఇదే భోజనం చేస్తారా: కలెక్టర్

50చూసినవారు
సంగెం: మీరందరు ఇదే భోజనం చేస్తారా: కలెక్టర్
సంగెం మండలంలోని కాపులకనపర్తి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్నికంగా తనిఖీ చేశారు. కాపుల కనపర్తి పాఠశాలకు వెళ్లిన సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. నాణ్యత లేదని గమనించిన కలెక్టర్ పాఠశాల హెచ్ఎం శోభారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరందరు ఇదే భోజనం చేస్తారా' అంటూ ప్రశ్నించారు. హెచ్ఎంకు షోకాజు నోటీసు జారీ చేయాలని డీఈవో జ్ఞానేశ్వర్ ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్