జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో డీయంఎఫ్టీ నిధులు రూ. 50 లక్షలతో దమ్మన్నపేట గ్రామం నుండి పరకాల చలివాగు(నాగారం) వెళ్లే గ్రావెల్ రోడ్డు మరమ్మత్తు పనులకు సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.