ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం బొల్లికుంటలోని జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులను వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే కలిసి ప్రారంభోత్సవం చేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన సదుపాయాలు రుచికరమైన భోజనం, ఉచితదుస్తులు, పుస్తకాలు, అందిస్తున్నామన్నారు.