మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పునః ప్రారంభమైంది. దీంతో పత్తి తరలిరాగా భారీగా ధర పలికింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7600 పలికినట్లు అధికారులు తెలిపారు. గత 3 నెలల వ్యవధిలో ఇదే అధికం అని వ్యాపారులు పేర్కొన్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.