Oct 04, 2024, 00:10 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఆధారంగానే రేషన్ కార్డులు
Oct 04, 2024, 00:10 IST
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం కాజీపేటలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ వెస్ట్ లోని 48 వ వార్డు, పదవ వార్డుల ను పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచే సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అన్నారు.