తాడ్వాయి: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

51చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయిలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందాడు. గురువారం ఇందిరానగర్ గ్రామానికి చెందిన సాధు వీరస్వామి (57) అనే మత్స్యకారుడు సమీపంలోని బంగారు కుంటలో చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఉదయం వెళ్లిన వ్యక్తి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో బంధువులు వెళ్లి వెతకగా కుంటలో శవంగా కనిపించాడు.

సంబంధిత పోస్ట్