అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశెల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శనివారం అర్థరాత్రి అటవీశాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 2 లక్షల విలువైన టేకు దుంగలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బక్కయ్య, విజయ్, రవి అనే ముగ్గురు కలప స్మగ్లర్ల పై కేసు నమోదు చేసి బొలెరో వాహనం సీజ్ చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.