Oct 25, 2024, 12:10 IST/
ప్రైవేట్ స్కూల్లో గ్యాస్ లీక్.. 35 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు
Oct 25, 2024, 12:10 IST
చెన్నైలోని తిరువొటియూర్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో శుక్రవారం ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. ఈ పాఠశాలలో 1000 మందికి పైగా విద్యార్థులు చదువుతుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవ్వడంతో 30 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వెంటనే పాఠశాలలోని విద్యార్థులందరినీ ఖాళీ చేయించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.