తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు వరంగల్ నగరంలో బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చారు. సాయంత్రం స్థానిక దేవాలయాలు, కూడళ్ల వద్దకు తీసుకొచ్చారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. బంగారు బతుకమ్మ ఉయ్యాలో. 'అంటూ రాత్రి వరకు ఆడిపాడారు. అనంతరం నిమజ్జనం చేశారు.