కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. నాయకులు మంద మహేశ్ బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపేశ్వరాలయ చిత్రపటాన్ని బండి సంజయ్ కి బహుమానంగా అందించారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని మంద మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.