వాట్సప్, ఫేస్బుక్ ఫొటోలు షేర్ చేయడం, సమాచారం పంపించడం, చాటింగ్ చేయడానికి ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తారు. కానీ, వాట్సప్, ఫేస్బుక్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మన ముచ్చట్లు, తూర్పు జర్నలిస్టులు అనే వాట్సప్ గ్రూపు సభ్యులు బుధవారం రక్తదానం చేశారు. గ్రూపు అడ్మిన్ పెరుమాండ్ల మధు జన్మదిన వేడుకల సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 20 యూనిట్ల రక్తాన్ని అందించారు.