అక్టోబర్ 1 న నిర్వహించే ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో వయోవృద్ధుల దినోత్సవ గోడప్రతులను ఆవిష్కరించారు. వయోవృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కుటుంబసభ్యులపై చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాలను వారం రోజుల పాటు జిల్లాలో నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఆదివారం వయోవృద్ధులకు ఆటల పోటీలను ఉంటాయన్నారు.