అత్తింటి వేధింపులు భరించలేక వరంగల్ లోతుకుంటకు చెందిన తూడి సునీల్ బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇంతేజార్ గంజ్ పీఎస్ సీఐ షుకూర్ తెలిపారు. మిషన్ భగీరథ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీల్ కు ఏడేళ్ల క్రితం దివ్యతో వివాహం కాగా, వారికి ఆరేళ్ల కూతురు ఉంది. సునీల్ తల్లి తూడి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.