వరంగల్ దేశాయిపేటలోని సాయిబాబా మందిరంలో ఆషాడశుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో సాయిబాబాకి 500 కళశాలతో విశిష్ట అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అషాడ శుద్ధ గురుపౌర్ణమి రోజున సాయిబాబాకు అభిషేకాలు చేయడం భక్తులకు ఎంతో ఆశీర్వాదకరం అన్నారు. కార్యక్రమంలో 200 మందికి అన్న ప్రసాదం చేయడం జరిగిందని అర్చకులు తెలిపారు.