ఉపాధ్యాయుల మహాధర్నా విజయవంతం

370చూసినవారు
ఉపాధ్యాయుల మహాధర్నా విజయవంతం
ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద యూఎస్పీసీ, జేఏసిటిఓ నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా టీఎస్యూటీఎఫ్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెండెం రాజు మాట్లాడుతూ.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి రఘుపతిరెడ్డి, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమమే శరణ్యమని, సంఘాలకతీతంగా ఇప్పటికైనా ఉపాధ్యాయులందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా నుండి ధర్నాకు హాజరైన జిల్లా, మండల బాధ్యులు, కార్యకర్తలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్