కార్మికుని మృతికి కారణమైన కాంట్రాక్టర్ ను అరెస్టు చేయాలి

67చూసినవారు
కార్మికుని మృతికి కారణమైన కాంట్రాక్టర్ ను అరెస్టు చేయాలి
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి చెందాడని ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో కార్మికుడు మృతి చెందిన ప్రాంతాన్ని సందర్శించారు. వరంగల్ బస్టాండ్ ని ఆధునీకరణ చేసే క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం బలైపోయిందని, కూల్చివేతల్లో ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం వల్లే, ఇలా జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్