వరంగల్ చౌరస్తాలో అయిదు రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు బుధవారం జిల్లా సీనియర్ సిటిజన్స్ సభ్యులు మల్లారెడ్డి, డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. స్పృహలోకి వచ్చాక తన పేరు శ్రీనివాస్ అని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక గ్రామం అని తెలపడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు.