వరంగల్: తప్పిపోయిన మూడేళ్ల బాలుడి అప్పగింత

53చూసినవారు
వరంగల్: తప్పిపోయిన మూడేళ్ల బాలుడి అప్పగింత
వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన మూడేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లిపోయాడు. వెంటనే బాలుడి తండ్రి అజీం స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై రవీందర్, హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, బ్లూకోర్ట్ పోలీసుల సహాయంతో అబ్బనికుంటలో వెతికారు. బాలుడి ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు

సంబంధిత పోస్ట్