కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యార్థుల దగ్గర నుండి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మంగళవారం అన్నారు. పెంచిన ఫీజులు తగ్గించుకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.