హన్మకొండ జిల్లాలో ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్ద ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.