వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ నగరానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వర్షాల్లో నగరవాసుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఏదైనా సమస్య ఉన్న వాళ్లు వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, మొబైల్ నంబర్ 9154252936 లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సత్య శారదా కోరారు.