శనివారం నుంచి జిల్లాల వారిగా గాంధీ భవన్ లో ముఖ్య నాయకులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ ఛార్జి దీప్ దాస్ మున్షీ సమావేశం కానున్నారు. జిల్లాల వారీ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్ జిల్లా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4 గంటల వరకు ఇతర జిల్లాల సమావేశాలు జరుగుతాయని తెలిపారు.