వరంగల్ ఇస్లామియ కాలేజీ గ్రౌండ్ లో ఉద్యోగ ఉపాధ్యాయులతో ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కందుల జీవన్ కుమార్ కోరారు. నూతనంగా తీసుకొస్తున్న మరొక యూపీఎస్ విధానాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చారని, మా డిమాండ్లను పరిష్కరించేందుకే ఈ భారీ సభను ఏర్పాటు చేశామన్నారు.