హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని అన్నారు