గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ వేయి స్తంభాల దేవాలయం వద్ద నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు పల్లెల నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2024 టార్చ్ ర్యాలీని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా తో కలిసి ప్రారంభించారు.