మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం శ్రీ వేట వేంకటేశ్వరస్వామి ఆలయ స్వయంప్రతిపత్తి కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ధర్మకర్తలు, దాతలు, ఎన్నారై పులి ప్రమీల గోపాల్ రెడ్డి, రామాయణం అనువంశిక అర్చకులు ఆధ్వర్యంలో ట్రస్టీ ఏర్పాటు సహా శ్రీ వేట వెంకటేశ్వర ఆలయాన్ని దేవాదాయ శాఖ నుంచి తొలగించాలని బుధవారం వరంగల్ ధార్మిక భవన్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.