సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పేర్కొన్న అన్ని వివరాలను ఎన్యుమరేటర్ సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు జాగ్రత్తగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఎన్యుమరేటర్ల సమక్షంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్ చేస్తుండగా పరిశీలించారు.